MAY 8 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోరు. పనులు చేశామంటే చేశామన్నట్టుగా ఉంటారు.

Update: 2023-05-08 03:21 GMT

may 8th horoscope in telugu

నేటి పంచాంగం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, సోమవారం

తిథి : బ.తదియ సా.6.16 వరకు
నక్షత్రం : జ్యేష్ఠ రా.7.07 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : మ.12.37 నుండి 1.28 వరకు, మ.3.10 నుండి 4.01 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : సా.5.00 నుండి 5.40 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతివిషయంలో అంటీముట్టనట్టుగా ఉండటం మంచిది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడానికి దూరంగా ఉండాలి. ఏ విషయంలోనైనా కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. రిస్క్ కు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. కొత్త ఉద్యోగాలపై దృష్టిసారిస్తారు. తగాదాలతో కూడిన పనులపై దృష్టిపెడితే విజయాలు వరిస్తాయి. క్రయవిక్రయాల్లో తుది నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు సానుకూలంగా సాగుతున్నాయి. గౌరవ, మర్యాదలు కలిగి ఉంటారు. క్రీడా రంగాల వారికి అనుకూలం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకున్నదొకటి జరిగేది మరొకటిగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. పనులు వాయిదా పడుతుంటాయి. మంచి చేసి చెడ్డవారనిపించుకుంటారు. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగాల వారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోరు. పనులు చేశామంటే చేశామన్నట్టుగా ఉంటారు. తెలియని ఆందోళన, ఆలోచనలో ఉంటారు. జరిగిపోయిన సంఘటనలు జ్ఞాపకానికి వస్తాయి. పాతస్నేహాలు, పాత పరిచయాల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. సలహాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. స్నేహాలు శాశ్వతంగా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచిస్తారు. విలువైన వస్తుసామాగ్రిని కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కారణం లేకుండానే మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలుంటాయి. క్రీడా, కళాసాహిత్య రంగాల వారు అనుభవజ్ఞుల సలహాల మేరకు ముందుకు వెళ్లాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్తవిషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. న్యాయవాదులతో సంప్రదింపులు కలసివస్తాయి. విద్యార్థులకు సాధారణ ఫలితాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా ఉంటాయి. అర్థం చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. పెండింగ్ ఫైల్స్ లో కదలికలు వస్తాయి. వైద్య, రాజకీయ రంగంలో ఉన్నవారికి మెరుగ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడి తప్పదు. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలు, చర్చలు, మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంటుంది. అనారోగ్యంతో బాధపడేవారికి ఊరటనిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తప్పనిసరిగా ఉద్యోగ, వ్యాపారాలు సాగిస్తారు. మొక్కుబడిగా పనులు చేస్తారు. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలకు ఆకర్షితులవుతారు. పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు గడిచిన నాలుగురోజుల కంటే అనుకూలంగా ఉంటుంది. ఉపయుక్తమైన ఖర్చులుంటాయి. ఎంతమంది పొగుడుతారో.. అంతమందీ తిట్టుకుంటారు. ప్రతి విషయాన్నీ మనసుకి తీసుకోకపోవడం మంచిది. నూతన పెట్టుబడులు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.







Tags:    

Similar News