NOVEMBER 12 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Update: 2022-11-12 02:46 GMT

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శనివారం

తిథి : బ.చవితి రా.10.25 వరకు
నక్షత్రం : మృగశిర ఉ.7.33 వరకు
వర్జ్యం : సా.4.55 నుండి 6.42 వరకు
దుర్ముహూర్తం : రా.11.09 నుండి 7.43 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : ఉ.11.00 నుండి మ.12.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కలిసివస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకుంటారు. దంపతుల మధ్య తగాదాలు, విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నీలాపనిందలు అధికమవుతాయి. ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్, రాజకీయ, ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి ఈరోజు ఊహించినంత అనుకూలంగా ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మంచిచెడులు సమానంగా ఉండాయి. ప్రతివిషయంలో లాభం చూసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు చిన్నచిన్న ఒడిదుడుకులు కలుగుతాయి. ఖర్చులు అధికం. శ్రమ ఎక్కువగా ఉంటుంది. కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు స్థిరాస్తుల్లో మెరుగైన ఫలితాలుంటాయి. విబేధించిన వారి స్నేహితులవుతాయి. యాత్రలు, ప్రయాణాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా మెరుగ్గా ఉంటాయి. శుభవార్తలు వింటారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శత్రుబలం పెరుగుతుంది. ఇబ్బందులకు గురిచేసేవారు పెరుగుతారు. తగాదాలు చోటుచేసుకుంటాయి. ప్రతి పనిలో సంశయంగా ఉంటారు. ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం. పనులు వాయిదా పడుతుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. నీలాపనిందలు ఎక్కువవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు శుభకార్యాలపై దృశ్టిసారిస్తారు. ఖర్చులు ఉపకరిస్తాయి. ఆరోగ్యంపై దృష్టిసారిస్తారు. వ్యవసాయరంగంలో ఉన్నవారికి అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారికి ధీటుగా బదులిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఊరట లభిస్తుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసపు రంగు.
కుంభ రాశి

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ముఖ్యంగా ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో- ఇంట్లో తగాదాలు చోటుచేసుకుంటాయి. ఈ రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ముందడుగు వేస్తారు. ఆహార నియమాలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.


Tags:    

Similar News