NOVEMBER 16 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు

Update: 2022-11-15 23:30 GMT

today horoscope

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బుధవారం

తిథి : బ.అష్టమి పూర్తిగా
నక్షత్రం : ఆశ్లేష సా.6.59 వరకు
వర్జ్యం : ఉ.6.29 నుండి 8.16 వరకు
దుర్ముహూర్తం : మ.11.30 నుండి 12.15 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : ఉ.9.30 నుండి 10.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. బ్యాంకింక్ సెక్టార్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయవిక్రయాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఊరట కలుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపారం విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మోసపోయేందుకు అవకాశాలెక్కువ. తప్పనిసరి పనులు మినహా.. మిగతా పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు తిరగబెడతాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒడిదుడుకులు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. నూతన వస్త్రాలు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఒత్తిడులు పెరుగుతాయి. అన్ని రంగాల వారు అధికజాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి సహాయ, సహకారాలు అందుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కెరియర్ పై దృష్టి సారిస్తారు. మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలం. అభివృద్ధి దిశగా పయనిస్తారు. వ్యాపరస్తులకు కూడా అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. నిరుత్సాహ పరిచే మాటలు వినకపోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలం. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అపార్థాలు చోటుచేసుకుంటాయి. చిన్న చిన్న తగాదాలుండొచ్చు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలకు వైద్యం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రేమలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు, విబేధాలతో సాగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. అపార్థాలు కలుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.


Tags:    

Similar News