NOVEMBER 21 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా..
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, సోమవారం
తిథి : బ.ద్వాదశి ఉ.10.07 వరకు
నక్షత్రం : చిత్త రా.12.14 వరకు
వర్జ్యం : ఉ.8.29 నుండి 10.03వరకు, తె.5.36 నుండి ఉ.7.07 వరకు
దుర్ముహూర్తం : మ.12.16 నుండి 1.00 వరకు, మ.2.30 నుండి 3.14 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి మ.12.00 వరకు
శుభ సమయాలు : సా.6.00 నుండి 7.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అప్పులు తీర్చేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అగ్రిమెంట్లు ముందుకు సాగుతాయి. వ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థినీ, విద్యార్థులకు కాలం అనుకూలిస్తుంది. ప్రయాణాలుంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు కారణం లేకుండానే చిరాకుగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. కారణంలేకుండానే తగాదాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు దేనిపైనా ఆసక్తి ఉండదు. రొటీన్ గా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. చాలాకాలంగా ఆగిపోయిన పనుల్లో కదలికలు వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతంగా వ్యవహరిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మాట పడరు. అన్నింటా విజయం వరిస్తుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరిపై ఆధారపడకుండా పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నేరేడుపండు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసర ప్రయాణాలుంటాయి. శారీరకంగా, మాసికంగా అలసట పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. క్రయవిక్రయాలకు సానుకూలం. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి పనీ నిదానంగా సాగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. విదేశీ యాన ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. రహస్యాలను పంచుకోవడం మంచిది కాదు. ఖర్చులు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పింక్ కలర్.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మీకు సహకరించే వర్గం తక్కువగా ఉంటుంది. అప్పు చేసే సూచనలున్నాయి. ఆరోగ్యం నలతగా ఉంటుంది. నిద్రాహారాలు లోపిస్తాయి. వివిధ రకాల ఆలోచనలతో నిరుత్సాహపడతారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది. శ్రేయోభిలాషులతో ఆనందంగా గడుపుతారు. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.