NOVEMBER 22 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యంగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి ..

Update: 2022-11-21 23:30 GMT

22ND NOV HOROSCOPE

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, మంగళవారం

తిథి : బ.త్రయోదశి ఉ.8.49 వరకు
నక్షత్రం : స్వాతి రా.11.12 వరకు
వర్జ్యం : తె.4.26 నుండి ఉ.5.56 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.32 నుండి 9.17 వరకు, రా.10.37 నుండి 11.28 వరకు
రాహుకాలం : మ.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభ సమయాలు : మ.12.40 నుండి 1.15 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వేగంగా పూర్తవుతాయి. కాంట్రాక్టు రంగాల వారికి, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక ఊరట లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయం వివాదాలతో కూడుకుని ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. పనులు వాయిదా పడుతూ పూర్తవుతాయి. యాంత్రికంగా పనిచేస్తారు. ఉత్సాహం, ఉల్లాసం లోపిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యంగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కలసివస్తాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. మాట పడతారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. వ్యాపారపరమైన చర్చలు ఫలిస్తాయి. పుణ్య చ్చేత్రాలు దర్శిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
వృశ్చిక రాశి

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఫలితం ఉండదు. శత్రుబలం, దృష్టిదోషం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వ్యాపారస్తులకు అనుకూలం. ఆరోగ్యం నలతగా ఉంటుంది. సేవింగ్స్ పై దృష్టి సారిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. విదేశీయాన ప్రయత్నాలకు అవాంతరాలు తొలగిపోతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మంచి వైద్యం అందుతుంది. అన్ని రంగాల వారికి అన్ని విధాలా కాలం కలసివస్తుంది. శుభకార్యాల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. నిద్రాహారాలు లోపిస్తాయి. అన్ని వయసుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. యాంత్రికంగా పనిచేస్తారు. పనివేళలు పెరగడంతో ఉత్సాహం లోపిస్తుంది. కష్టానికి తగిన గుర్తింపు ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు.



Tags:    

Similar News