NOVEMBER 26 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. మనస్పర్థలు తొలగించుకునే ప్రయత్నాలు..

Update: 2022-11-25 23:30 GMT

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, మార్గశిర మాసం, శనివారం

తిథి : శు. తదియ రా.7.23 వరకు,
నక్షత్రం : మూల మ.2.58 వరకు
వర్జ్యం : మ.1.32 నుండి 2.58 వరకు, రా.11.38 నుండి 1.05 వరకు
దుర్ముహూర్తం : ఉ.6.21 నుండి 7.50 వరకు
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : మ.1.30 నుండి 3.00 వరకు
శుభ సమయాలు : ఉ.11.40 నుండి 12.15 వరకు, సా.5.45 నుండి 6.30 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిదానమే ప్రధానంగా ముందుకు సాగాలి. పనివేళలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఇంట, బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. శత్రుబాధలు అధికమవ్వచ్చు. వాహనం నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తారుమారవుతాయి. స్నేహితులతో తగాదాలు ఏర్పడవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. పెళ్లి చూపులు వంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపార చర్చలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మోసపోయేందుకు ఆస్కారం ఉంది. సంతానంతో మాటపట్టింపులు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా వేసుకుంటారు. అలసట పెరుగుతుంది. ఇష్టమైన వారితో కాలం గడిపేందుకు ఇష్టపడతారు. క్రయవిక్రయాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. మనస్పర్థలు తొలగించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. బాధ్యతల బరువు నుండి ఊరట లభిస్తుంది. సంఘ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటుచేసుకుంటాయి. డాక్యుమెంటేషన్లో జాగ్రత్తగా ఉండాలి. సంతానం పట్ల బాధ్యతను నెరవేరుస్తారు. విద్యార్థినీ, విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉత్సాహంగా ఉంటారు. వివాహాది శుభకార్యాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తారు. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంచనాలు తలకిందులవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. నూతన పరిచయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు నూతన అవకాశాలు కలసివస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రతి విషయంలో నిర్మొహమాటంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.




Tags:    

Similar News