November 2 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాహన ప్రమాదాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు అంతంతమాత్రంగానే..

Update: 2022-11-01 23:30 GMT

today horoscope

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బుధవారం

తిథి : శు.నవమి రా.9.09 వరకు
నక్షత్రం : ధనిష్ట రా.1.43 వరకు
వర్జ్యం : ఉ.6.41 నుండి 8.13 వరకు
దుర్ముహూర్తం : మ.11.28నుండి 12.14 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 5.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూలం. పార్ట్ టైమ్ జాబ్స్ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన వివాదాలు ఎదురవుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ఒడిదుడుకులు ఉంటాయి. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం. అప్పు చేయడం, ఇవ్వడం మంచిది కాదు. శుభకార్యాల చర్చలు వాయిదా పడుతుంటాయి. దంపతుల మధ్య మాటపట్టింపులు ఏర్పడుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్ని విధాలా వృత్తి-ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. తీరని సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. క్రయవిక్రయాలకు సానుకూలం. వాహన యోగం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. శత్రుబలం పెరుగుతుంది. తప్పు లేకపోయినా మాట పడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. నిద్రాహారాలు లోపిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వాహన ప్రమాదాలు ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ప్రతివిషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. చర్చలు ఫలిస్తాయి. క్రయవిక్రయాలకు సానుకూలంగా ఉంటుంది. తగాదాలు, విబేధాలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు ఉంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఉదర, కంటి సమస్యలు రావొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. వ్యవసాయ, రాజకీయ రంగాలకు మరింత అనుకూలం. దంపతుల మధ్య చిన్న తగాదాలు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సాధారణ ఫలితాలుంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరగవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వం వహించకపోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.


Tags:    

Similar News