NOVEMBER 3 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అపార్థాలు ఎదురవుతాయి. విద్యార్థినీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి.
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, గురువారం
తిథి : శు.దశమి రా.7.30 వరకు
నక్షత్రం : శతభిషం రా.12.49 వరకు
వర్జ్యం : ఉ.8.39 నుండి 10.11 వరకు
దుర్ముహూర్తం : ఉ.9.57 నుండి 10.42 వరకు, మ. 2.30 నుండి 3.16 వరకు
రాహుకాలం : మ.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభ సమయాలు : సా.4.00 నుండి 5.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి- ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలుంటాయి. బంధువులతో తగాదాలు, విభేదాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. అంచనాలు తారుమారవుతాయి. పనులు వాయిదా వేసుకుంటారు. నిరుత్సాహంగా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీపొడి రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యస్థ ఫలితాలుంటాయి. శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువగా ఉంటుంది. మోసపోయే అవకాశాలుండటంతో.. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. పనులు చేయడంలో ఇబ్బంది పడతారు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజ భాగస్వామ్య వ్యాపారులకు అనుకూలంగా ఉంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త ఆలోచనలు పుంజుకుంటాయి. సమస్యలను పరిష్కరించుకుంటారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఆర్థిక విషయాలు కలసివస్తాయి. అప్పులు వసూలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమస్యల నుండి బయట పడుతారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు అధికంగా ఉంటాయి. ఇంట్లో ఉన్న వారితో గొడవలు పెరుగుతాయి. ఏకాంతంగా ఉండాలనుకుంటారు. ఎందులోనూ క్లారిటీ ఉండదు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అపార్థాలు ఎదురవుతాయి. విద్యార్థినీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కలసివస్తాయి. చర్చలు ఫలిస్తాయి. వృత్తి-ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. వివాదాలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. తప్పు లేకున్నా మాట పడాల్సి ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. పెట్టుబడులు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తగాదాలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. గాయాలు అవ్వొచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.