October 12 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు
తిథి : బ.తదియ రా1.59 వరకు, నక్షత్రం : భరణి సా.5.10 వరకు, వర్జ్యం : తె.5.56 నుండి ఉ.7.38 వరకు
నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : బ.తదియ రా1.59 వరకు
నక్షత్రం : భరణి సా.5.10 వరకు
వర్జ్యం : తె.5.56 నుండి ఉ.7.38 వరకు
దుర్ముహూర్తం : మ.11.30 నుండి 12.17 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : లేవు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉన్నాయి. క్రయవిక్రయాలకు అనుకూలం. అప్పులు తీరుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు తగాదాలు- విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో నేర్పుగా ఉంటారు. వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించడం అవసరం. వాహన ప్రమాదాలు జరగవచ్చు. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కొత్త ఆలోచనలు కలుగుతాయి. పెండింగ్ పనుల్లో కదలికలుంటాయి. ప్రయాణాలు కలసివస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. కొత్త పెట్టుబడుల కోసం చర్చలు ఫలిస్తాయి. కొత్తపరిచయాలుంటాయి. చర్చలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఒత్తిడులు పెరుగుతాయి. తగాదాలు - విభేదాలు ఏర్పడవచ్చు. ఆర్థికపరంగా ఒత్తిడి తప్పదు. మనస్పర్థలు ఏర్పడుతాయి. పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఒడిదుడుకులు అధికం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అనుకున్నదొకటి జరిగేది మరొకటి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు టెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి. పనులు వేగంగా పూర్తి చేస్తారు. భార్య-భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒడిదుడుకులు, అభివృద్ధి సమానంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాలు అనుకూలం. రుణప్రయత్నాలు కలసివస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు ఇంట-బయట ఒడిదుడుకులు ఎదురవుతాయి. పనులు ఎక్కువగా ఉండటంతో అలసట పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేయని తప్పుకి బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ రోజు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఎంత తక్కువ మాట్లాడితే అంత లాభం పొందుతారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు క్రయ విక్రయాలకు అనుకూలం. వివాదాస్పద అంశాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. పరిస్థితులు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు అధికం. భార్య-భర్తల మధ్య తగాదాలు సహజం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సలహాలువ్వడంలో తగ్గడం మంచిది. నిర్ణయాలు కలసిరావు. ఈ రోజు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ.