October 31 : నేటి పంచాగం, ద్వాదశ రాశుల దినఫలాలు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వ్యతిరేకంగా ఉంటుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు.

Update: 2022-10-30 23:30 GMT

OCT 31ST HOROSCOPE

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, సోమవారం

తిథి : శు.సప్తమి రా.1.11 వరకు
నక్షత్రం : ఉత్తరాషాఢ తె.4.15 వరకు
వర్జ్యం : మ.1.17 నుండి 2.47 వరకు
దుర్ముహూర్తం : మ.12.14 నుండి 12.59 వరకు
                           మ.2.31 నుండి 3.17 వరకు
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభ సమయాలు : మ.12.15 నుండి మ.12.50 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు మధ్యాహ్నం తర్వాతి నుంచి అనుకూలంగా ఉంది. వృత్తి-ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఈ రోజు ధరించకూడని రంగు బంగారు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. ఖర్చులు విస్తారంగా ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రోజు ధరించకూడని రంగు గంధం రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం మాత్రమే కాలం అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి విసుగు పెరుగుతుంది. అప్పులు చేసే సూచనలున్నాయి. మొహమాటంతో పనులు చేస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు కలసివస్తుంది. ఆర్థిక విషయాలకు అనుకూలం. నూతన ఉద్యోగ అవకాశాలు యోగిస్తాయి. వైద్యులతో సంప్రదింపులు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. కాంట్రాక్ట్, వైద్య వృత్తుల్లో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ రోజు నిదానమే ప్రధానంగా ఉంటారు. ఆర్థిక సర్దుబాట్లలో ఒడిదుడుకులుంటాయి. ఇంట్లోవారికి, బయటి వారికి సర్దిచెప్పుకోవడంతో సతమతమవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఉదయం మాత్రమే అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ, రాజకీయ, కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. దంపతుల మధ్య అన్యోన్యత కాస్త తగ్గుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు బాగుంటుంది. క్రీడా, సాహిత్య రంగాల్లో వారికి అనుకూలమైన మార్పులు ఉంటాయి. క్రయవిక్రయాలకు అనుకూలం. వృత్తి-ఉద్యోగాల్లో అవకాశాలను ఉపయోగించుకుంటారు. భవిష్యత్ పై దృష్టిసారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు చిలకాకుపచ్చ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. రిజిస్ట్రేషన్లు వాయిదా పడొచ్చు. పని ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ప్రతి విషయంలో పాజిటివ్ గా ఉంటారు. ఈ రోజు ధరించకూడని రంగులు లేత రంగులు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వ్యతిరేకంగా ఉంటుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు. పనులను వీలైనంత వరకూ వాయిదా వేసుకోవడం మంచిది. నిద్రాహారాలు లోపిస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు వృత్తి- ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలు కలసివస్తాయి. చర్చలు ఫలిస్తాయి. పుకార్లు, అపార్థాలు తొలగిపోతాయి. దాన ధర్మాలకు ఆకర్షితులవుతారు. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.


Tags:    

Similar News