Diwali : దీపావళి రోజు తలస్నానం ఎందుకు చేయాలి? లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించాలి?

దీపావళి ఈ నెల 12వ తేదీన వచ్చింది. పైగా ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు

Update: 2023-11-09 06:12 GMT

దీపావళి ఈ నెల 12వ తేదీన వచ్చింది. పైగా ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆఫీసులకు సెలవు కావడంతో పండగను మరింత వేడుకగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దీపావళి రోజున ఏం చేయాలి? లక్ష్మీదేవి ఏ సమయంలో పూజించాలి? అన్న అనుమానాలు అందరిలోనూ సహజంగా కలుగుతాయి. దీపావళి అంటే దీపాల పండగ. సాయంత్రానికి ఇంటి ముందు దీపాలు వెలిగించడమే కాకుండా బాణాసంచా ను కాలుస్తూ పిల్లలతో కలసి పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు.

ఆదివారమే దీపావళి...
ఆదివారం ఉదయాన్నే తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల అనారోగ్యాలు ఏవైనా ఉంటే దూరమవుతాయని పండితులు చెబుతారు. ఈ నెల 11న ధనత్రయోదశిని జరుపుకోవాలని అంటారు. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదంటారు. ఈరోజు బంగారం కొంటే మంచిదని భావిస్తారు. అంతేకాదు ధనత్రయోదశి నాడు దానధర్మాలు చేయడం ఉత్తమమని పండితోత్తములు చెబుతున్నారు.
అష్టైశ్వర్యాలతో పాటు...
లక్ష్మీదేవిని భక్తి శ్రద్థలతో పూజిస్తే ఆ ఇంటి సిరులు ఉంటాయని చెబుతారు. అందుకే కొత్తగా బంగారం కొనుగోలు చేసి మరీ అనేక మంది లక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది. కేవలం సిరిసంపదలు మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతారు. అందుకే ధనత్రయోదశినాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. అంటే ఈ నెల 11న లక్ష్మీదేవిని పూజించి, 12న మాత్రం దీపావళి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అలాగే చేయడం వల్ల భోగభాగ్యాలతో జీవిస్తారన్న నమ్మకం అందరిలోనూ ఉంది.
Tags:    

Similar News