Gold Price Today : పండగ వేళ షాకిచ్చిన గోల్డ్ రేట్స్.. ధర ఎంతో తెలిస్తే గుండెల్లో బాంబులు పేలినట్లే
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి
దీపావళికి టపాసులు పేలతాయి. కానీ బంగారం ధరలు మాత్రం పేలిపోతున్నాయి. పండగ వేళ కూడా ధరలు పెరిగి వినియోగదారులను నిరాశకు గురి చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఎక్కువ సార్లు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గింది చాలా తక్కువ సార్లు. నిన్నటి నుంచి థన్ తెరాస్ రావడం, నేడు కూడా కూడా కొనసాగుతుండటంతో బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. థన్ తెరాస్ కు ఆశించినంత కొనుగోళ్లు జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. పసిడి ధరలు పెరగడం ఒక కారణమయితే.. నెలాఖరులో డబ్బులు లేని సమయంలో పండగ వచ్చినందున కొనుగోళ్లు మందగించి ఉంటాయన్న అభిప్రాయం కూడా ఉంది.
రేపటికి మరింత...
ఇక దీపావళి రోజున బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి కేవలం పండగ ఒక్కటే కారణం కాదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో ఎన్నికల ప్రభావం ఈ ధరలపై ప్రభావం చూపుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేంత వరకూ బంగారం ధరల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలు కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఒక కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద బంగారం ధరలలో పెరుగుదలే కానీ తగ్గుదల కనిపించడం లేదు.
వెండి ధరలు మాత్రం...
కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుండటం, డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధరలు మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,760 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,460 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,06,800 రూపాయలుగా ఉంది.