Diwali Muhurat Trding : ముహూరత్ ట్రేడింగ్ అంటే ఏంటి? దీపావళి రోజునే ఎందుకు చేస్తారు?

దీపావళి రోజు భారతీయ స్టాక్ మార్కెట్ తెరిచే ఉంటుంది. ఆరోజు సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నారు.

Update: 2024-10-25 13:49 GMT

దీపావళి అంటే కేవలం దీపాల పండగ మాత్రమే కాదు. అది వ్యాపారులకు మొదలయ్యే సంవత్సరం. దీపావళి రోజు నుంచే తమ వ్యాపారం మొదలు పెట్టినట్లు పుస్తకం తెరిచి లక్ష్మీదేవిని పూజిస్తారు. అందుకే మార్వాడీలతో పాటు వ్యాపారులకు ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో వ్యాపారులకు దీపావళి అంటే ఒక విశిష్టమైన పండగ. దీపావళికి ముందు తమ దుకాణాలను శుభ్రపర్చుకుంటారు. వీలయితే కొత్తగా రంగులు వేయిస్తారు. అందంగా అలంకరిస్తారు. తమ ఇంటిని మించి దుకాణాలను అలకంరించి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీపావళి అంటేనే వారికి ప్రత్యేక పండగలా భావిస్తారు. ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు.

శుభప్రదంగా...
దీపావళి రోజు భారతీయ స్టాక్ మార్కెట్ తెరిచే ఉంటుంది. ఆరోజు సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నారు.. పెట్టుబడుదారులు కొత్త పెట్టుబడులను ప్లాన్ చేసుకుంటూ ఉంారు. ముఖ్యంగా ముహూరత్ ట్రేడింగ్ చేయడం మంచి అవకాశం, శుభప్రదంగా భావించి ఎక్కువ మంది పెట్టుబడులు పెడతారు. అయితే ఈసారి నవంబరు 1వ తేదీన సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకూ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే స్టాక్ ఎక్సేంజ్ ప్రకటించడంతో ఆరోజు ఇక పెట్టుబడుల వెల్లువ జరుగుతుంది. ముహూర్తం ట్రేడింగ్ అటే దీపావళి రోజు సాయంత్రం గంట సేపు ఉంటుంద.ి ఈ గంటలో ఎన్ఎస్ఈ, బీఎస్‌ఈ వంటి స్టాక్ ఎక్సేంజ్‌లు ప్రకటిస్తాయి అందుకే వ్యాపారులకు, మదుపురులకు దీపావళి ప్రత్యేక పండగ.
ఏ పని అయినా...?
దీపావళి రోజు ఏ పని ప్రారంభించినా విజయం లభిస్తుందని వ్యాపారులు విశ్వసిస్తారు. అందుకే దీపావళిరోజున వ్యాపారాలు మొదలు పెట్టడమే కాదు.. పెట్టుబడులు కూడా పెడతారు. ముహూరత్ ట్రేేడింగ్ లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ఉత్సా: చూపుతారు. ముహూరత్ ట్రేడిం్ 1957లో బాంబే సాక్ట్ ఎక్సేంజ్ లో ప్రారంభించారు. ఇక 1999లోనే జాతీయ స్టాక్ ఎక్నేజీలో కూడా ముహూరత్ ట్రేడింగ్ ప్రారంభమయింది. వ్యాపారంలోనే కొత్తగా హిందూ సంవత్సరం ప్రారంభమయినట్లు ఈరోజు నుంచేనని ప్రారంభిస్తారు. కొత్త పుస్తకాలు తెరిచి లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. అందుకే ముహూరత్ ట్రేడింగ్ రోజు అన్ని మార్కెట్‌లు లాభాల బాటలో పయనిస్తాయి. ఏ పనిచేసినా మంచి జరుగుతుందని భావించి కొంత పెట్టుబడి అయినా పెట్టేదే ముహూర్తం ట్రేడింగ్ కు ఉన్న ప్రాధాన్యత.


Tags:    

Similar News