నేడే ముహూర్త్ ట్రేడింగ్ .. ఏ టైమింగ్స్ లో ఉందంటే?

దీపావళి నుంచి వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈరోజు సాయంత్రం మాత్రం ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది.

Update: 2024-11-01 01:54 GMT

దీపావళి రోజు నుంచి వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈరోజు సాయంత్రం మాత్రం ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది. సుమారు గంటసేపు ఈ ట్రేడింగ్ జరగనుంది. దీపావళి నిన్ననే పూర్తయినా ముహూరత్ ట్రేడింగ్ మాత్రం నేడు జరగనుంది. దీపావళి పర్వదినాన ఏ పని ప్రారంభించినా అది సజావుగా సాగుతుందని భావిస్తారు. ఆ నమ్మకమే ఈ స్పెషల్ ట్రేడింగ్ జరగుతుంది. ఈరోజు ట్రేడింగ్ చేస్తే వచ్చే దీపావళి వరకూ వరసగా తమకు లాభాలు వస్తాయన్న నమ్మకమే ఈ మూహూరత్ ట్రేడింగ్ ప్రత్యేకత.

ఏడాది అంతా...
అందుకే ఈ ముహూరత్ ట్రేడింగ్ లోనే ఎక్కువ మంది పాల్గొంటరు. శుక్రవారం అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకూ ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది. ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహపడటంతో స్టాక్ ఎక్సేంజ్ కూడా దడ దడ లాడిపోతుంది. అయితే లాభాలను ఆర్జించే సంస్థలను గుర్తించి పరిశీలించి వాటిపై ట్రేడింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా మార్కెట్ లోకి రావాలనుకున్న వారికి కూడా ఈ సమయం ఒక ప్రత్యేమని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News