మట్టి గణపతి ముఖ్యం

పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి ప్రతిమలే శ్రేష్ఠమని అందరూ

Update: 2022-08-27 02:41 GMT

ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకులు ఎక్కడ చూసినా కనపడేవి..! కానీ అటు ప్రజల్లోనూ.. ఉత్సవ సేవా సమితుల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. మట్టి గణపతినే ఉపయోగించాలనే తీర్మానం చాలా మంది చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా గత కొన్నేళ్లలో మట్టి వినాయకుడిని ప్రతీష్టించడం చాలా ఎక్కువైంది. అందుకు తగ్గట్టుగా పలు సంస్థలు, ప్రభుత్వాలు మట్టి గణేషుడిని ఉచితంగా పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు. ప్రజల్లో పర్యావరణం పట్ల పెరిగిన అవగాహన కారణంగా మట్టి గణపతిని మొదటి ఎంపికగా భావిస్తూ ఉన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తే కాలుష్యం ఏర్పడుతుంది. ఇక అలాంటి విగ్రహాల నిమజ్జనంపై కోర్టు ఆంక్షలు కూడా ఉన్నాయి. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కనపెట్టి పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమివ్వాలని పలువురు పిలుపును ఇస్తున్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి ప్రతిమలే శ్రేష్ఠమని అందరూ తెలుసుకుంటూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం సైతం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని ప్రోత్సహిస్తోంది. గతంలో కేవలం మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేవారు. తమ వినాయకుడే భారీగా, ఆకర్షణీయంగా ఉండాలని ఖర్చు విషయంలో వెనక్కి తగ్గకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తీసుకుని వచ్చారు. అయితే వాటి వల్ల కలిగే అనర్థాలను తెలుసుకున్నారు. పర్యావరణ ప్రేమికులు,నిపుణులు హెచ్చరించడంతో ప్రజల్లో అవగాహన కలిగి మట్టి విగ్రహాలే మేలని భావిస్తున్నారు. చిన్నచిన్న విగ్రహాలే కాకుండా భారీ మట్టి గణపతులనే ప్రతిష్ఠించేందుకు అందరూ ముందుకు వచ్చారు.


Tags:    

Similar News