వినాయక చవితికి ఎలాంటి విగ్రహం తీసుకోవాలి..?

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు

Update: 2022-08-26 11:32 GMT

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి, వినాయక విగ్రహం తీసుకోవాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. తెలుపు, కుంకుమ రంగుల్లో ఉన్న విగ్రహాలను తీసుకోవాలి. లేదంటే మట్టి రంగులో ఉన్నది తీసుకోవాలి. మట్టి విగ్రహం తీసుకోవాలి. వినాయక చవితి పూజ కోసం ఏక వింశతి పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇందులో తులసి, జిల్లేడు, రేగు, మరువం, రావి, దానిమ్మ, ఉత్తరేణి, బిల్వ, మారేడు, గరిక, జమ్మి, మాచీ పత్రి, ఉమ్మెత్త, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దేవదారు, వావిలి, జాజి, గండలీ, మద్ది ఆకులతో పాటు బంతి, పారిజాతం ఉండాలి. పూలు, వెలక్కాయతో పాటు వీలున్న పండ్లు, నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసి మామిడి తోరణాలు, పూలు కట్టి వాకిళ్లు అలంకరించాలి. ఒక పీటకు పసుపు రాసి దానిపై బియ్యం వేసి కుంకుమ బొట్టు పెట్టి దానిపై వినాయకుడి తలపై వచ్చేలా పాలవెల్లిని ఏర్పాటు చేయాలి. దీని కోసం వెదురు ముక్కలతో పందిరిలా కట్టి దానికి పండ్లు, వెలగ కాయ, మొక్కజొన్న కండెలు, పూలు కట్టి అందంగా అలంకరించాలి. దానికి పసుపు, కుంకుమ పెట్టి పీట పై ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వినాయకుడి నైవేద్యం కోసం గారెలు, పాయసం, ఉండ్రాళ్లు, కుడుములు అక్కడ పెట్టుకోవాలి. రాగి లేదా వెండి చెంబుకి పసుపు రాసి కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆపై పసుపు ముద్దతో గణపతిని తయారుచేసుకొని పక్కన పళ్లెం పెట్టుకోవాలి. ఆ తర్వాత పూజ ప్రారంభించి వినాయక ప్రార్థన చేసి సంకల్పం తీసుకొని కలశ పూజ చేయాలి. కలశ పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని పూజించి ప్రాణ ప్రతిష్ట చేసి పీటపై ఉంచాలి. ఆ తర్వాత అధాంగ పూజ, అష్టోత్తరం, కథ పూర్తి చేసి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి.


Tags:    

Similar News