గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్నారు... నట్టేట మునిగారు
కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ కూడా తప్పుదోవ పట్టిస్తుందని చెప్పే ఘటన కేరళలో జరిగింది
ఇప్పుడు ఎవరు ఎక్కడకు వెళ్లాలన్నా అడ్రస్ తెలియకపోయినా పరవాలేదు.. గూగుల్ మ్యాప్ ఉంటే చాలు అది రూటు చూపుతుంది. చక్కగా మనం ఎవరినీ అడక్కుంటే మనకు కావాల్సిన చోటకు వెళ్లొచ్చు. ఒకరిని అడగాల్సిన పనిలేదు. విసిగించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కడకు వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ నే ఉపయోగిస్తున్నారు. కొత్త చోటు అనేది మనకు తెలియకపోయినా గూగుల్ మ్యాప్ వచ్చిన తర్వాత ఆ భయం పూర్తిగా పోయినట్లే అని భావించారు
హైదరాబాద్ నుంచి...
కాని కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ కూడా తప్పుదోవ పట్టిస్తుందని చెప్పే ఘటన కేరళలో జరిగింది. కేరళలోని అలిప్పీకి కారు హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు బయలుదేరి వెళ్లారు. అయితే రూట్ కొత్త కావడంతో వాళ్లు గూగుల్ మ్యాప్ ను ఉపయోగించారు. అది చెప్పినట్లే కారును పోనిచ్చారు. అయితే వాళ్లు ప్రయాణిస్తున్న కారు కాల్వలోకి దూసుకెళ్లింది. కారు నీట మునడంతో యువకులు నీటిలో మునిగిపోయారు. దీంతో అక్కడ స్థానికుల చూసి వారిని రక్షించారు. గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని వస్తే నట్టేట మునిగినట్లేనని ఈ ఘటన చెబుతుంది.