బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. తనీఖీలు చేయగా?

హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది

Update: 2024-06-24 07:40 GMT

హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా ఎయిర్ పోర్టులో బాంబుపెటినట్లు గుర్తించిన భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టులోని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్కాడ్ ను రప్పించి బేగంపేట్ ఎయిర్ పోర్టు లోపల, బయట తనిఖీలు నిర్వహించారు.

మెయిల్ పంపిన వారిని...
అయితే పోలీసులు, బాంబ్ స్క్కాడ్ జరిపిన తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని స్పష్టం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాయి. బాంబు బెదిరింపు ఆకతాయిలు పనిగా గుర్తించారు. దీంతో మెయిల్ పంపిన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇటీవల ఎయిర్‌ పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ పిల్ల చేష్టలుగా మారడంతోపోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ జరుపుతున్నారు.


Tags:    

Similar News