నేడు ఈడీ ఎదుటకు అజారుద్దీన్

ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ హాజరు కానున్నారు;

Update: 2024-10-08 04:16 GMT
azharuddin, former hca president,  today enforcement directorate in hyderabad, azharuddin will attend a meeting of enforcement directorate officials today,  azharuddin latest updates today

 azharuddin

  • whatsapp icon

ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ హాజరు కానున్నారు. గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. .2020 - 2023 మధ్యలో హెచ్‌సీఏ లో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అందాయి.

హెచ్‌సీఏలో స్కామ్ ....
దాదాపు 3.8 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో దానిపై విచారణ జరుగుతుంది. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్వివ్‌ప్‌మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలు లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంలో గతంలో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ పొందారు.తాజాగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేయడంతో నేడు ఈడీ ఎదుటకు విచారణ కు హాజరు కానున్నారు.


Tags:    

Similar News