హైదరాబాద్‌ లో భారీ వర్షం... నిలిచిన విద్యుత్తు సరఫరా

హైదరాబాద్‌ లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.;

Update: 2025-04-03 11:53 GMT
heavy rain, weather, changed, hyderabad
  • whatsapp icon

హైదరాబాద్‌ లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈరోజు రాత్రికి భారీ వర్షం కురిసే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండలాని సూచించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సచివాలయం, అబిడ్స్, నాంపల్లి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురిసింది.

ఈదురుగాలులు వీయడంతో...
భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీయడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్తును సరఫరాను నిలిపివేశారు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. నగరం మొత్తం చల్లబడింది. నిన్నటి వరకూ ఎండలు, ఉక్కపోతకు గురయిన హైదరాబాద్ ప్రజలు ఒక్కసారిగా చల్లగాలుల పలకరింపుతో పులకించిపోయారు.


Tags:    

Similar News