హైదరాబాద్‌లో పెరిగిన అత్యాచారాలు.. వార్షిక నివేదికలో షాకింగ్ విషయాలు
2023 సంవత్సరం మరో వారం రోజుల్లో ముగియబోతోంది. కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ ఏడాదిలో;
2023 సంవత్సరం మరో వారం రోజుల్లో ముగియబోతోంది. కొత్త సంవత్సరం 2024లోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఈ ఏడాదిలో జరిగిన క్రైమ్ రేటు గురించి వివరాలను పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. హైదరాబాద్ కమీషనరేట్ ఇయర్ ఎండింగ్ మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను అందించారు. పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల విషయంలో కష్టపడి పనిచేశారని ఆయన అభినందించారు. పండలు, ర్యాలీలు, సభలు, ఎన్నికలు ఇలా ఒక్కటేమిటో అన్ని రకాల కార్యక్రమాలకు సమర్ధవంతంగా భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూశామన్నారు. హైదరాబాద్‌లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాల రేటు 2 శాతం పెరిగిందని వార్షిక నివేదిక పేర్కొంది. మొత్తంగా ఎఫ్‌ఐఆర్‌లు 24,821 నమోదు కాగా, దోపిడీలు 9 శాతం, మహిళలపై నేరాలు 12 శాతం పెరిగినట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులుపై నేరాలు మాత్రం 12 శాతం తగ్గడం శుభపరిణామనే చెప్పాలి.
వార్షిక నివేదికలో నేరాల చిట్టా..
☛ వివిధ కేసులో రూ.38 కోట్ల మేర నష్టం
☛ పొగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ
☛ 79 హత్యలు
☛ రేప్ కేసులు 403
☛ కిడ్నాప్‌లు 242
☛ చీటింగ్ కేసులు 4,909
☛ రోడ్డు ప్రమాదాలు 2,637
☛ హత్యాయత్నాలు 262
☛ దొంగతనాలు 91
☛ ఈ ఏడాది 63 శాతం నేరస్తులకు శిక్షలు
☛ 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు
☛ 4,465 మంది నేరస్థులకు శిక్షలు
☛ ఈ ఏడాది 83 డ్రగ్ కేసుల్లో 241మందిని అరెస్ట్
☛ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యాచార కేసులు 19 శాతం పెరుగుదల
☛ గత ఏడాదితో పోల్చితే నగరంలో హత్యలు తగ్గుదల
☛ సైబర్ క్రైం కేసులు మాత్రం 12 శాతం పెరుగుదల
☛ మత్తు పదార్థాలు వాడిన 740 మంది అరెస్ట్
☛ డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయుల అరెస్ట్
☛ గత ఏడాది తో పోలిస్తే ఈఏడాది 11 శాతం సైబర్ నేరాలు పెరుగుదల
☛ ఇన్వెస్టమెంట్ స్కీమ్‌ల ద్వారా రూ.401 కోట్లు
☛ మల్టిలెవల్ మార్కెటింగ్ ద్వారా రూ. 152 కోట్లు
☛ రూ.10 వేల కోట్లకుపైగా ఆర్థిక నేరాల మోసాలు
☛ భూకుంభకోణాల్లో 245 మంది అరెస్ట్
☛ సైబర్ క్రైమ్స్ నేరాలలో 650 మందిని అరెస్ట్
ఇక న్యూ ఇయర్ రోజు డ్రంక్ డ్రైవ్ చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఆ రోజు రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్‌లకు అనుమతి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.