Hyderabad Metro: హైదరాబాద్ వాసులకో గుడ్ న్యూస్
ఆదివారం రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సురక్షిత
ఆదివారం రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అర్ధరాత్రి వరకు సర్వీసులను నిర్వహిస్తుందని హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. చివరి రైళ్లు 12.15 గంటలకు సంబంధిత స్టేషన్ల నుండి బయలుదేరి.. జనవరి 1, 2024 న తెల్లవారుజామున 1 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపారు. మెట్రో రైలు పోలీసులు, భద్రతా విభాగాలు కూడా విధుల్లో ఉంటాయని ఆయన తెలిపారు. ఆ సమయాల్లో సురక్షిత ప్రయాణ ఏర్పాట్లు చేశామని.. ప్రయాణికులు అధికారులకు సహకరించాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతాయుతంగా మెట్రో రైళ్లలో ప్రయాణించాలని ఎల్‌అండ్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిబి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 31, ఆదివారం రాత్రి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించినట్లు తెలిపింది. రేపు అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతున్నామని మెట్రో అధికారులు తెలిపారు. చివరి రైలు ఆయా స్టేషన్ల నుంచి 12.15 నిమిషాలకు బయలుదేరుతుందని తెలిపారు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ రైలు గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపారు.