భారత్ ఓటమిపై సీవీ ఆనంద్ ఏమన్నారంటే?

న్యూజిలాండ్ తో జరిగిన భారత్ మూడో మ్యాచ్ ఓటమి పాలయిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు;

Update: 2024-11-04 02:25 GMT
cv anand, police commissioner, responded, india lost the series, hyderabad police commissioner cv anand,  cv anand responded after india lost the third match against new zealand, india vs new zealand

cv anand responded after india lost third match

  • whatsapp icon

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాజీ క్రికెటర్. ఆయన నిన్న న్యూజిలాండ్ తో జరిగిన భారత్ మూడో మ్యాచ్ ఓటమి పాలయిన తర్వాత స్పందించారు. ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3 -0 తో ఓడిపోవడం అద్భుతమైన, అసాధ్యమైన విజయాన్ని న్యూజిలాండ్ ఆస్వాదిస్తున్నప్పుడు తాను సిగ్గుపడుతున్నానని సీవీ ఆనంద్ తెలిపారు. గతంలోనూ తప్పులు అనేకం జరిగినా వెంటనే కెప్టెన్లు తీసేవారని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు.

జట్టుకు భారంగా మారి...
శ్రీకాంత్, గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ ను అడిగితే ఈ విషయం చెబుతారని సీవీ ఆనంద్ అన్నారు. ఇక్కడ సీనియర్లు అనే పిలుచునే వారంతా ఫామ్ లో ఉండి జట్టుకు భారంగా మారిపోయారన్నారు. చాలా కాలంగా జట్టుకు భారంగా ఉన్నప్పటికీ రిటైర్‌మెంట్‌కు మాత్రం ఒప్పుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు విమానంలో కూర్చుని ఉన్నారని ఆయన ఎద్దేవా చేవారు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభను చూపిస్తున్న వారిని ఎందుకు జట్టుకు ఎంపిక చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. భారత్ లో అనేక మంది యువకులు క్రికెట్ లో్ రాణిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. గంభీర్ కున్న రికార్డులేంటి? ఆయన మాట్లాడే మాటలేంటి? అంటూ ఆనంద్ ప్రశ్నించారు. భవిష్యత్ కసం మంచి టీమ్ ను తయారు చేయడానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.


Tags:    

Similar News