Big Breaking : అల్లు అర్జున్ అరెస్ట్.. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.సంథ్య థియేటర్ లో మహిళ మరణించిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-12-13 07:08 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.సంథ్య థియేటర్ లో మహిళ మరణించిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తన వాహనంలో అల్లు అర్జున్ ను పోలీసులకు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంథ్య థియేటర్ ఘటనలో...
ఎలాంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ కు పుష్ప ప్రీమియర్ షోకు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించింది. ఈ ఘటనపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే అల్లు అర్జున్ తనపై నమోదయిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను చిక్కడపోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెయల్ ఇచ్చి పంపుతారా? లేక కోర్టులో ప్రవేశపెడతారా? అన్నది తెలియాల్సి ఉంది. 


Tags:    

Similar News