పవన్ కల్యాణ్ వద్దకు అల్లు అర్జున్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు;

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన అల్లు అర్జున్ పవన్ తో కాసేపు మాట్లాడారు. ఇటీవల పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి కోలుకున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వెళ్లారు.
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై...
చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ కలుసుకున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి అల్లు అర్జున్ తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, మార్క్ శంకర్ కు ఎక్కడెక్కడ గాయాలయింది? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అన్న దానిపై పవన్ కల్యాణ్ ను అడిగి అల్లు అర్జున్ తెలుసుకున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు.