ఆర్జీవీ కోసం హైదరాబాద్ కు వచ్చిన పోలీసులు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు;

Update: 2024-11-25 06:53 GMT
ram gopal varma, director, maddipadu police, hyderabad
  • whatsapp icon

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ కు వచ్చారు. అయితే ఆయన హైదరాబాద్ లో ఇంట్లో లేరని తెలిసింది. కోయంబత్తూరులోని ఒక ఫంక్షన్ కు ఆయన హాజరయ్యేందుకు ఆయన వెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో పోలీసులు వర్మ వచ్చేంత వరకూ వెయిట్ చేస్తారా? లేక మరోసారి నోటీసులు ఇచ్చి వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది.

విచారణకు హాజరు కాకపోవడంతో...
దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. గతంలో వర్మ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అందిన ఫిర్యాదుపైనోటీసులు జారీ చేశారు. రెండుసార్లు ఇప్పటికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినా ఆయన హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మాత్రం అక్కడ అందుబాటులో లేరని తెలిసింది. జూబ్లీహిల్స్ లోని వర్మ నివాసానికి పోలీసులు చేరుకుని అక్కడే ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు.


Tags:    

Similar News