Hyderabad : బంతి కోసం ప్రయత్నించి.. లిఫ్ట్ పడి ప్రాణాలు పోయి?
సూరారంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో అక్బర్ పాటిల్ అనే వ్యక్తి మరణించాడు.;

హైదరాబాద్ లో వరసగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా సూరారంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో అక్బర్ పాటిల్ అనే వ్యక్తి మరణించాడు. హైదరాబాద్ లోని సూరారం కాలనీలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో ఈ ఘటన జరిింది. 39ఏళ్ల అక్బర్ పాటిల్ అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నారు. బంతిని తీయడానికి అని వెళ్లి మరణించాడు.
లిఫ్ట్ గుంతలో బంతి పడటంతో....
అపార్ట్ మెంట్ లిఫ్ట్ గుంతలో బంతి పడటంతో దానిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో అక్కడికక్కడే మరణించాడని స్థానికులు తెలిపారు. లిఫ్ట్ గుంతలో తలపెట్టినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నందునే లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో అక్బర్ పాటిల్ కుటుంబం విషాదంలో మునిగింది