హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు;

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనేక మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్.సి.యూ భూములను అమ్మకాలకు విక్రయాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే నిన్న రాత్రి అరెస్ట్ చేసిన విద్యార్థులను తిరిగి విడుదల చేశారు. ఈరోజు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళనలు కొనసాగే అవకాశముంది.
భారీ బందోబస్తు...
దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరినీ అటువైపు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. క్యాంపస్ కు చెందిన స్థలంలో ప్రభుత్వం జేసీబీతో చెట్లను తొలగించే ప్రక్రియను చేపట్టడంతో విద్యార్థి సంఘాలు భూములు అమ్మకానికే చదును చేస్తున్నారని, వీటిని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.