టోల్‌ప్లాజాల వద్ద రద్దీ... దసరా ఎఫెక్ట్
దసరా పండగకు ఈరోజు సొంతూళ్లకు బయలుదేరడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంది;

traffic on national highway
దసరా పండగకు ఈరోజు సొంతూళ్లకు బయలుదేరడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
పంతంగి టోల్ ప్లాజా వద్ద....
ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా మంది సొంత వాహనాలలో బయల్దేరడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ఫాస్టాగ్ ద్వారా చెల్లిస్తున్నా ఆలస్యమవుతుందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులందరూ ఈరోజు సొంత వాహనాలలో బయలుదేరారాు. మరోవైపు రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి