ఏమో.. ఈసారి విజేత కావచ్చేమో

రాజస్థాన్ రాయల్స్ జట్టు బలంగా ఉంది. దీంతో పాటు లక్‌ కూడా కలసి వస్తున్నట్లే అనిపిస్తుంది.

Update: 2023-04-28 03:12 GMT

రాజస్థాన్ రాయల్స్ జట్టు బలంగా ఉంది. దీంతో పాటు లక్‌ కూడా కలసి వస్తున్నట్లే అనిపిస్తుంది. ఈసారి విజేతగా రాజస్థాన్ రాయల్స్ నిలిచినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు క్రీడా పండితులు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇప్పటికే జోస్యం కూడా చెప్పారు. అది నిజమయ్యేటట్లే ఉంది. 2008 విజేతగా రాయల్స్ విజేతగా నిలిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో బలంగా ఉన్న రాజస్థాన్ ఇతర జట్లను సులువుగా ఢీకొట్టే సత్తా ఉందంటున్నారు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలచే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మీద రాజస్థాన్ రాయల్స్ జట్టటు విజయం సాధించడం అంచనాలు నిజమయ్యేలా అనిపిస్తున్నాయి.

అగ్రస్థానంలో...
ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లో ఐదింటిలో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే జైపూర్ సేడియంలో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్ 77 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు.
నిన్నటి మ్యాచ్‌లో....
మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ థోని సేన ముందు భారీ టార్గెట్ విధించింది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆది నుంచి కొంత తడబడుతూనే ఆడుతుంది. ఆరు వికెట్లు నష్టపోయి 20 ఓవర్లలో కేవలం 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 32 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించినట్లయింది.




Tags:    

Similar News