Jharkhand Elections : జార్ఖండ్ లో పోరు హోరాహోరీ

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమిల మధ్య పోరు హోరాహోరీగా నడుస్తుంది.

Update: 2024-11-23 03:29 GMT

జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమిల మధ్య పోరు హోరాహోరీగా నడుస్తుంది. తొలుత ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు 3 3 స్థానాల్లో బీజేపీ కూటమి, 27 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ ఎన్నికల్లో ముందంజలో ఉంది. దీంతో ఇక్కడ కూడా కమలం పార్టీకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి.

రెండు కూటముల మధ్య...
అదే సమయంలో రెండు కూటముల మధ్య హోరాహోరా పోరు జరుగుతున్నట్లు అర్థమవుతుంది. గిరిజన ప్రాంత ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపితే వారిదే జార్ఖండ్ రాష్ట్రం సొంతమవుతుంది. అందుకే ఈసారి ఎన్నికలను రెండు కూటములు ప్రతిష్టాత్మకంగాతీసుకున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ లో కొంచెం బీజేపీ ఆధిక్యంగా కనిపిస్తున్నా హోరా హోరీ పోరు మాత్రం రెండు కూటముల మధ్య కనిపిస్తుంది.


Tags:    

Similar News