Vivo X80, Vivo X80 Pro మొబైల్ ఫోన్స్ స్పెసిఫికేషన్ లీక్

Vivo X80 FHD+ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల E5 AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్,

Update: 2022-04-04 12:27 GMT

Vivo X80, Vivo X80 Pro మొబైల్ ఫోన్స్ ఈ నెలలో చైనాలో విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్ అయిన ఇవి.. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌తో పాటు 80W ఛార్జింగ్ సపోర్ట్, 120Hz AMOLED ప్యానెల్, 32MP ఫ్రంట్ కెమెరా, వేపర్ చాంబర్ హీట్ డిస్సిపేషన్ మెకానిజం, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ OS ఓషన్ సాఫ్ట్‌వేర్‌తో రానున్నాయి. రెండు Vivo X80 ఫోన్‌ల మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్నాయి.

Vivo X80 FHD+ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల E5 AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, Schott 3D గ్లాస్ ప్రొటెక్షన్, 1500 nits పీక్ బ్రైట్‌నెస్, DC డిమ్మింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంటుందని అంటున్నారు . అంతేకాకుండా 32MP సెన్సార్‌తో కూడిన పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో 12MP అల్ట్రావైడ్ స్నాపర్, 2x ఆప్టికల్ మాగ్నిఫికేషన్‌తో 12MP జూమ్ లెన్స్‌తో పాటు 50MP సోనీ IMX866 ప్రధాన సెన్సార్ ఉంటుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 4,300mm² VCతో పాటు డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీతో రానుంది. సాఫ్ట్‌వేర్ OriginOS ఓషన్ స్కిన్‌తో Android 10తో రానుంది. మిగిలిన ఫీచర్స్ లో భాగంగా.. IP53 ఇంగ్రెస్ ప్రొటెక్షన్, NFC, X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్, IR బ్లాస్టర్ ఉన్నాయి.

Vivo X80 Pro విషయానికొస్తే, మంచి ప్రాసెసర్, ఛార్జింగ్ సొల్యూషన్, సాఫ్ట్‌వేర్, సెల్ఫీ కెమెరా, వేపర్ కూలింగ్ ఛాంబర్, స్క్రీన్ ప్రొటెక్షన్, ఫ్రంట్ AMOLED రిఫ్రెష్ రేట్ Vivo X80లో ఉన్నట్లేనని తెలుస్తోంది. ఫోన్ వెనుక కెమెరా సెటప్‌లో 50MP GN1 ప్రధాన కెమెరా, 48MP సోనీ IMX598 అల్ట్రావైడ్ షూటర్, 2x ఆప్టికల్ మాగ్నిఫికేషన్‌తో పాటు 12MP జూమ్ లెన్స్ అలాగే గింబల్ OIS సపోర్ట్, 8MP పెరిస్కోప్ కెమెరా, 5x జూమ్‌తో కూడిన ఓఐఎస్‌పి కెమెరా సెటప్‌ ఉన్నాయి. Vivo X80 Pro లో 4700 mAh బ్యాటరీని కలిగి ఉంది, QHD+ రిజల్యూషన్ డిస్‌ప్లేతో పాటు, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ రీడర్, IP68 వాటర్.. డస్ట్ రెసిస్టెన్స్ బాడీని కలిగి ఉంది. ఇవి లీక్ లను బట్టి ఉన్న వివరాలు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


Tags:    

Similar News