ఫుడ్ ప్యాకేజింగ్ కోసం వార్తాపత్రికలను వాడకండి
సాధారణంగా ఏదైనా తినడానికి ఆర్డర్ ఇస్తే.. చాలా వరకూ న్యూస్ పేపర్స్ లో ప్యాకేజింగ్ చేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్స్ లో తినే ఆహారపదార్థాలు ఆరోగ్యానికి హానికరమని ఇప్పటికే చాలా మంది హెచ్చరించారు.
సాధారణంగా ఏదైనా తినడానికి ఆర్డర్ ఇస్తే.. చాలా వరకూ న్యూస్ పేపర్స్ లో ప్యాకేజింగ్ చేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్స్ లో తినే ఆహారపదార్థాలు ఆరోగ్యానికి హానికరమని ఇప్పటికే చాలా మంది హెచ్చరించారు. తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆహార విక్రేతలు, వినియోగదారులను ఫుడ్ ప్యాకేజింగ్ కోసం వార్తాపత్రికలను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ఇది ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని తెలిపింది. వార్తాపత్రికలలో ఉపయోగించే సిరా వివిధ రకాల బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది, ఇది మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
ప్రింట్ చేసే ఇంకులో సీసం, లోహాలు, ఇతర రసాయనాలు కలిగి ఉంటాయి. ప్రింటింగ్ ఇంక్‌లు ఆహారంలోకి చేరడం.. వాటిని మనం తీసుకోవడం కారణంగా ఎన్నో ప్రమాదాలను కలిగిస్తాయని FSSAI హెచ్చరించింది. వార్తాపత్రికలు బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర వ్యాధికారక క్రిములకు ఆవాసంగా మారే అవకాశం ఉంది. ఇది ఆహారంలో కలిస్తే.. వాటిని తిన్న వాళ్లు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని FSSAI హెచ్చరించింది.