నిధుల మళ్లింపు వ్యవహారం..హీరో మోటో కార్ప్‌పై విచారణ

ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌పై భారత కొర్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది.

Update: 2023-06-15 12:42 GMT

hero motocorp

ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌పై భారత కొర్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. థర్డ్ పార్టీ అమ్మకందారుతో కలిసి ఈ సంస్థ అనధికారికంగా నిధుల మళ్లింపుకు పాల్పడిరదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా హీరో మోటోకార్ప్‌ యాజమాన్య నిర్మాణం (స్ట్రక్చర్‌ ) గురించి వివరాలు తెలుసుకోడానికి, మూడో పార్టీ అమ్మకందారుని ప్రభావితం చేస్తోందేమో అనే విషయం బహిర్గతం చేయడానికి ఈ విచారణను ఆదేశించినట్లు కేంద్రప్రభుత్వంలోకి కీలకమైన వ్యక్తి ఒకరు రాయిటర్‌కి వెల్లడిరచారు.

‘హీరో’ భారతదేశంలో అత్యంత ఎక్కువగా మోటార్‌ సైకిళ్లను తయారు చేసే కంపెనీ. దాని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 56,000 కోట్ల రూపాయలు. ఆ కంపెనీ ఒక్కో షేరు ధర 2865 రూపాయలు. గురువారం 105 రూపాయల నష్టంతో ట్రేడ్‌ అయింది. ‘విచారణ విషయమై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, అందుకే ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేమని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఏ నియంత్రణ మండలి, ఎలాంటి సమాచారం అడిగినా, మేము పూర్తిగా అందిస్తాము, వారికి పూర్తిగా సహకరిస్తాము.’ అని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి తెలిపారు. ఈ వార్త కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది. 

Tags:    

Similar News