లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది.. స్పెషల్ ఏమిటి?
ఈ ఏడాది ఫిబ్రవరిలో 29వ తేదీ వచ్చింది. నాలుగు సంవత్సరాలకు ఒకసారి
ఈ ఏడాది ఫిబ్రవరిలో 29వ తేదీ వచ్చింది. నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే లీపు ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ అనేది మన సాధారణ సంవత్సరంతో పోలిస్తే, అదనపు రోజు ఉన్న సంవత్సరం. సాధారణంగా ఏడాదికి 365 రోజులుంటాయి. కానీ లీపు సంవత్సరంలో 366 రోజులుంటాయి. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నాలుగేళ్లకోసారి ఈ లీపు సంవత్సరం వస్తుంది. నాలుగుతో విభజితమయ్యే ప్రతి సంవత్సరం ఈ లీపు ఇయర్ అవుతుంది. 00 తో ముగిసే సంవత్సరాలకు లీపు సంవత్సరం రాదు.
సోలార్ ఇయర్లో 5 గంటల 48 నిమిషాల 56 సెకన్లు సమయం ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 365.24 రోజులు. ఇది ఇలాగే కొనసాగితే కాలక్రమేణా సీజన్లు మారతాయి. అందుకే ప్రతి నాలుగేళ్లకోసారి లీప్ డేను జోడించడం వల్ల మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. ఉన్న నెలల్లోకల్లా రెండో నెలలోనే తక్కువ రోజులుంటాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో ఒకరోజును అదనంగా కలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.