మేఘా సుధారెడ్డి హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?
పలువురు సెలెబ్రిటీలు బిర్కిన్ బ్యాగ్ లకు ఫ్యాన్స్ అయ్యారు. ఈ బ్యాగ్ లను కలెక్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు పలువురు;
జేన్ బిర్కిన్, బ్రిటిష్ నటి, గాయని. 76 సంవత్సరాల వయస్సులో చనిపోయింది. ఆమె తన ప్రతిభతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. బిర్కిన్ పారిస్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. 2002లో బిర్కిన్ లుకేమియా వ్యాధి నిర్ధారణ అయింది. వివిధ చికిత్సలు చేయించుకుంది. ఈ వ్యాధి తరువాతి కాలంలో ఆమెలో అనేక ఆరోగ్య సమస్యలకు కారణమైంది.
జేన్ బిర్కిన్ ఫ్రాన్స్‌లో బాగా పాపులర్. 1960, 70 లలో ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచారు. ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ బ్రాండ్ 'హెర్మేస్' ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లలో ఒకటైన 'బిర్కిన్'ని రూపొందించడానికి ఆమె స్ఫూర్తినిచ్చింది. ఈ పర్స్ ను స్టేట్‌మెంట్ పీస్ లాగా భావిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా డిమాండ్ చేసే బ్యాగ్‌లలో ఇది కూడా ఒకటి. ఈ ఫ్రెంచ్ బ్రాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీన్-లూయిస్ డుమాస్ 1984లో లండన్‌కు వెళ్లే విమానంలో వెళుతున్న సమయంలో జేన్ ను చూసి లెదర్ బ్యాగ్‌ని తీసుకుని రావాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగా ఆ తర్వాత పలు లగ్జరీ బ్యాగ్ లను తీసుకుని వచ్చారు. వీటి ధర లక్షల్లోనూ.. కోట్లలోనూ ఉంటుంది.
పలువురు సెలెబ్రిటీలు బిర్కిన్ బ్యాగ్ లకు ఫ్యాన్స్ అయ్యారు. ఈ బ్యాగ్ లను కలెక్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు పలువురు సెలెబ్రిటీలు.. వారిలో ఫ్యాషన్ ఐకాన్ మేఘా సుధారెడ్డి కూడా ఒకరు. తన దగ్గర 10-15 బిర్కిన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒక్కో బిర్కిన్ బ్యాగ్ కు ఒక్కో స్టోరీ ఉందని చెప్పుకొచ్చారు. నేను దాదాపు 10-15 బిర్కిన్‌లను సొంతం చేసుకున్నానంటే అది నా అదృష్టం అనే చెప్పాలి.. ప్రతి ఒక్క బ్యాగ్ కు ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. 30 సెం.మీ బోర్డియక్స్ షైనీ క్రొకోడైల్ హీర్మేస్ బిర్కిన్ అంటే తనకు ఎంతో సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు. ఇవి కేవలం ఖరీదైన బ్యాగ్ లు మాత్రమే కాదని.. ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌స్ అనే విషయాన్ని తాను నమ్ముతానని అన్నారు. తన వ్యక్తిగత స్టైల్ కు ప్రతిరూపమని అన్నారు. ఆమె దగ్గరున్న బిర్కిన్ బ్యాగ్ ల కలెక్షన్ విలువ కోట్ల రూపాయలు ఉంటుంది.