ఓయో కస్టమర్లకు సూపర్ న్యూస్
గరిష్ఠంగా 5 వేల రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ రూపంలో వాడుకోవచ్చని తెలిపారు. హోటల్ రూమ్‌లో స్టే చేసిన 15 రోజుల తర్వాత;
కావాల్సినవి కొనుక్కోండి.. డబ్బులు వచ్చాక కట్టుకోండి అని పలు ఈ కామర్స్ సంస్థలు చెబుతూ ఉన్న సంగతి తెలిసిందే..! అదే ‘పే లేటర్’ సదుపాయం. ఈ నెల కావాల్సినవి కొనుక్కుని.. వచ్చే నెల లోపు కట్టుకోవచ్చనుకుంటూ పలువురు కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఓయో సంస్థ కూడా తీసుకొచ్చింది. దూర ప్రయాణాలు చేసేవారికి ఈ ఫెసిలిటీ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఓయో సంస్థ ప్రవేశ పెట్టిన ఈ సదుపాయం ‘స్టే నౌ, పే లేటర్’ పేరుతో ప్రచారం చేస్తుంది. ఈ ఫీచర్ తరచూ దూర ప్రయాణం చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో పాటు, అప్పటికప్పుడు కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఓయో గ్లోబల్ సీఓఓ అభినవ్ సిన్హా తెలిపారు. ఈ ‘స్టే నౌ, పే లేటర్’ ద్వారా గరిష్ఠంగా 5 వేల రూపాయల వరకు క్రెడిట్ లిమిట్ రూపంలో వాడుకోవచ్చని తెలిపారు. హోటల్ రూమ్‌లో స్టే చేసిన 15 రోజుల తర్వాత బిల్ పే చేసే అవకాశం ఇచ్చింది. ఈ ఫీచర్ కోసం ఓయో యాప్ హోం స్క్రీన్‌లో కనిపించే ‘ఎస్ఎన్‌పీఎల్’ ఫీచర్ ని యాక్సెస్ చేసుకోవాలి అని సీఈఓ అభినవ్ సిన్హా తెలిపారు. ఇలా రూమ్ బుక్ చేసుకునేవారికి 65 శాతం డిస్కౌంట్‌తో పాటు 50 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా వస్తుంది. స్టే చేసిన 15 రోజుల లోపు రూమ్ బిల్ చెల్లించకపోతే బిల్లు మొత్తంపై వడ్డీతో పాటు 250 రూపాయల లేట్ ఫీజ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.