అప్పుడే చిక్కుల్లో థ్రెడ్స్.. జుకర్ కు మస్క్ నోటీసులు

ట్విట్టర్ కు చెందిన వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నోటీసుల్లో అలెక్స్..

Update: 2023-07-07 05:21 GMT

twitter notices to meta threads

ఎలాన్ మస్క్ కు చెందిన ట్విట్టర్ కు పోటీగా.. మెటా సీఈఐ మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్స్ ను అందుబాటులోకి తెచ్చారు. వచ్చీరావడంతోనే థ్రెడ్స్ కు యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంచ్ చేసిన కొద్ది గంటలకే 30 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. థ్రెడ్స్ తో మస్క్ కు షాక్ తగిలింది అనుకుంటుండగా.. జుకర్ కు ఊహించని షాక్ తగిలింది. తమ మేధో సంపత్తి(intellectual property rights)ని కాపీ కొట్టారంటూ ఎలాన్ మస్క్ తన లాయర్ అలెక్స్ స్పిరో ద్వారా జుకర్ బర్గ్ కు నోటీసులు పంపించారు.

ట్విట్టర్ కు చెందిన వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తిని చట్టవిరుద్ధంగా దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నోటీసుల్లో అలెక్స్ స్పిరో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ట్విటర్ వాణిజ్య రహస్యాలు, ఇతర గోప్య సమాచారాన్ని తెలుసుకునేందుకు డజన్లకొద్దీ మాజీ ట్విట్టర్ ఉద్యోగులను మెటా నియమించుకుందని స్పిరో లేఖలో ఆరోపించారు. మెటాకు ట్విటర్ నోటీసులంటూ వచ్చిన వార్తలను ఉటంకిస్తూ చేసిన ట్వీట్ పై మస్క్ స్పందించారు. వ్యాపార రంగంలో పోటీ మంచిదే కానీ మోసం చేయకూడదని పేర్కొన్నారు. మరోవైపు థ్రెడ్స్ లో ట్విట్టర్ మాజీ ఉద్యోగులు ఉన్నారంటూ ట్విట్టర్ పంపిన నోటీసుల్ని మెటా ఖండించింది. థ్రెడ్స్ ఐటీ విభాగంగా మాజీ ట్విట్టర్ ఉద్యోగులెవరూ లేరని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ థ్రెడ్స్ పోస్ట్ లో తెలిపారు.


Tags:    

Similar News