1000 రోజుల లెజెండ్ : దటీజ్ బాలయ్య!

Update: 2016-10-25 12:06 GMT

ఇవాళ్టి రోజుల్లో ఎంత భారీ హిట్ చిత్రలు అయినా సరే.. 50 రోజులు ఆడే సరికి నిర్మాతలకు నరాలు తెగిపోతున్నాయి. తాజాగా నందమూరి వారి సూపర్‌హిట్ జనతా గ్యారేజ్ 50 రోజులు పూర్తయిన తర్వాత.. రెండో రోజునే టీవీ ఛానెల్ లో ప్రసారం పూర్తయిపోయిందంటే.. 50 రోజుల బెంచ్ మార్క్ తో నిర్మాతలు, దర్శకుడు, హీరో అంతా శాటిస్ ఫై అయిపోతున్నారనే అర్థం.. అలాంటిది.. ఒక సినిమా వెయ్యి రోజులు ఒకే థియేటర్లో ఆడడం అంటే మామూలు సంగతి కాదు! అలాంటి అరుదైన ఫీట్ ను బాలయ్య చిత్రం లెజెండ్ సాధించింది.

2014 మార్చి 28న విడుదల అయిన లెజెండ్ చిత్రం.. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్లో 950 రోజుల్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఇదే థియేటర్లో వెయ్యి రోజులు కూడా ఆడబోతోంది. ఆ సందర్భంగా 1000వ రోజు పోస్టర్ ను చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను సోమవారం ఆవిష్కరించారు.

థియేటర్ యజమాని ఓబుల్ రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీనును హైదరాబాదులో కలిసి ఆయన చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరింపజేశారు. 1000వ రోజు ప్రదర్శన సందర్భంగా థియేటర్లో ఓ కార్యక్రమం కూడా ఉంటుందని , ఆ కార్యక్రమానికి బోయపాటి శ్రీను కూడా హాజరవుతారని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

Similar News