103 కూడానా?

Update: 2017-09-05 12:00 GMT

బాలయ్య - పూరీలా క్రేజీ కలయికలో 'పైసా వసూల్' థియేటర్స్ లోకి వచ్చేసింది. పూరి జగన్నాధ్ మీదున్న నమ్మకంతో బాలకృష్ణ 'పైసా వసూల్' బాధ్యతలను పూర్తిగా పూరీకే ఇచ్చేసాడు. తన విషయంలో పూరి ఏం చెబితే అదే చేసాడు. పూరికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు బాలయ్య. అయితే 'పైసా వసూల్' టాక్ తో పూరి తన పంధాని మళ్ళీ రిపీట్ చేసాడు. బాలయ్య ఇచ్చిన సపోర్ట్ ని పూరి విస్మరించాడు. అసలు పూరి 'లోఫర్, జ్యోతిలక్ష్మి, ఇజం' లాగే మరో ప్లాప్ ని నెత్తిన వేసుకున్నాడు అనే మాట వినబడుతుంది. అలాగే బాలకృష్ణ మాత్రం తన వైపు నుండి సినిమాని గట్టెక్కించే ప్రయత్నం గట్టిగా చేసాడు. సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ విషయంలోనూ..నటన, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని విషయాల్లో 'పైసా వసూల్' ని భుజాన వేసుకుని కష్టపడ్డాడు. ఇక బాలయ్య ఈ సినిమాకి చేయాల్సని దాని కన్నా ఎక్కువే చేసాడు.

మరి బాలయ్య కష్టానికి 'పైసా వసూల్' పైసల్ వసూల్ చేసేలాగా కనబడడం లేదు. పూరి 'పైసా వసూల్' ని పచ్చడి పచ్చడి చేసి వదిలేసాడు. అసలు కామెడీ ట్రాక్ లేకుండా హీరోగారి మీద హీరోగారే భారీ పంచ్ లు వేసుకోవడం, హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కే వాడడం, విలన్స్ ని డమ్మీ చెయ్యడం వంటి వాటితో 'పైసా వసూల్' కి పైసల్ పోయేలా చేసిన పూరికి బాలకృష్ణ మరోమారు ఛాన్స్ ఇచ్చాడంటే మాత్రం ఎవ్వరికి నమ్మకమే కుదరడం లేదు. అయినా బాలకృష్ణ తన 103 సినిమా చేసే అవకాశాన్ని పూరీకే ఇస్తున్నానని ప్రకటించడం.... అది కాస్తా పూరి అవును నిజమే అని చెప్పడం జరిగిపోయాయి.

మరి నిజంగానే బాలకృష్ణ మరోసారి రాంగ్ స్టెప్ వేస్తున్నాడా? అంటే అవును నిజంగానే బాలయ్య ఆలోచనలేకుండా మరోసారి పూరి మీద బాధ్యతలు పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు నందమూరి అభిమానాలతోపాటే ఇండస్ట్రీలోని బాలయ్య సన్నిహితులు. అసలు పూరి వర్కింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది. డబ్బు కోసమే సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాను అనే రేంజ్ లోనే పూరి సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు గాని ఎలాంటి ఎఫర్ట్ సినిమా మీద పెట్టడం లేదు. మరి అలాంటి పూరి చేతికి మరలా 103 బాధ్యతలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం బాలయ్యా.. చెప్పయ్యా..!

Similar News