2018 : ఆఫ్ ఇయర్ డిజాస్టర్ సినిమాల లిస్ట్..!

Update: 2018-07-05 06:13 GMT

ఈ ఏడాది మొదలై అప్పుడే అర్ధభాగం గడిచిపోయింది. ఈ అర్ధభాగం లో టాలీవుడ్ అనేక సమస్యలతో, అనేక సంతోషాలలను చవిచూసింది. ఈ సంవత్సర అర్ధభాగంలో పలు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాగే బోలెడన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే... తొలిప్రేమ, ఛలో వంటి సినిమాలు హిట్స్ అయ్యాయి. ఇక అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, టచ్ చేసి చూడు, ఆఫీసర్ వంటి భారీ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. భారీగా తెరకెక్కిన సినిమా తుస్సుమంటే... లోబడ్జెట్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు పెట్టినదానికి డబల్ తెచ్చాయి. అయితే ఈ ఏడాది అర్ధభాగంలో ఫ్లాప్ సినిమాల లిస్ట్ ఇలా ఉంది.

1. అజ్ఞాతవాసి: ఈ ఏడాది మొదటి డిజాస్టర్ అజ్ఞాతవాసి చిత్రం. పవన్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ అజ్ఞాతవాసి చిత్రం భారీగానే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ సినిమాలో విషయం లేకపోవడంతో.. సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు. భారీగా రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోయారు.

2. టచ్ చేసి చూడు: రవితేజ - విక్రమ్ సిరికొండ కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. టచ్ చేసి చూడు ప్రేక్షకుల మైండ్ ని ఏ విధంగానూ టచ్ చెయ్యలేకపోయింది.

3. ఇంటలిజెంట్: వినాయక్ - సాయి ధరమ్ కాంబోలో తెరకెక్కిన ఇంటలిజెంట్ సినిమాని వినాయక్ అవుట్ డేటెడ్ కథతో... మెప్పించలేక భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

4. ఛల్ మోహన్ రంగ: దర్శకుడు త్రివిక్రమ్ కథతో... పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా లో నితిన్ - మేఘ ఆకాష్ జంటగా కృష్ణ ప్రసాద్ డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ ని మూటగట్టుకుంది. ఈ సినిమా ఫ్లాప్ తో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు అందుకున్నాడు..

5. కృష్ణార్జున యుద్ధం: ఈ సినిమా తో నాని వరుస విజయాలకు బ్రేక్ పడింది. నాని డ్యూయెల్ రోల్ పోషించిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు. 35 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. కేవలం 16 కోట్లు మాత్రమే వసూలు చేసి నాని కి షాక్ ఇచ్చింది.

6. నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా: అల్లు అర్జున్ - రైటర్ వక్కంతం వంశీ కలయికలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం నా పేరు సూర్య కూడా భారీ డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోయింది. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా సూపర్ గా నటించినప్పటికీ ... ఈ సినిమా టేకింగ్ లో లోపాల వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాదాపుగా 112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 58 కోట్లు రికవరీ చేసింది.

7. నేలటికెట్టు: రవితేజకు ఈ ఏడాది రెండో ఫ్లాప్ నేలటికెట్టుతో అందుకున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఎంతో కాన్ఫిడెంట్ తో నటించిన నేలటిక్కెట్టు బయ్యర్లను నేల నాకించేసింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.

8. ఆఫీసర్: నాగార్జున అతి నమ్మకంతో రామ్ గోపాల్ వర్మ కి ఆఫీసర్ ఛాన్స్ ఇస్తే వర్మ మాత్రం తన పాత బుద్ధితోనే ఈసినిమాకి తెరకెక్కించి నాగ్ కి ఫ్లాప్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కూడా నాగ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది.

ఇంకా ఈ ఏడాది కళ్యాణ్ రామ్ ఎమ్యెల్యే, నా నువ్వే సినిమాలు ఫ్లాప్ కాగా... నిఖిల్ కిర్రాక్ పార్టీ, మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర ఇలా ఇంకా కొన్ని సినిమాలు ఫ్లాప్ ల లిస్ట్ లో ఉన్నాయి.

Similar News