రీసెంట్ గా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. తన అభిమాని దేవ్ సాయి గణేష్ బోన్ క్యాన్సర్తో బాధా పడుతున్నాడని తెలుసుకుని ఇటీవలే అతని ఊరు అనకాపల్లికి వెళ్లి కాసేపు అతనితో గడిపి వచ్చాడు. అతని కోరిక బన్నీని చూడాలని. గణేష్ అన్నయ్య ఆ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా బన్నీ కి చేరేలా చేసాడు.
'నా పేరు సూర్య' సినిమా ప్రొమోషన్స్ లో ఉన్న బన్నీ టైం చూసుకుని అతని దగ్గరకు వెళ్ళాడు. బన్నీ తనని చూడటానికి రావడంతో ఆ సందర్భంగా గణేష్ ఆనందానికి అవధుల్లేవు. అతనితో బన్నీ కాసేపు ప్రేమగా మాట్లాడి ఫొటోలు దిగాడు. అంతే కాదు గణేష్ చికిత్స కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేశాడు. దేవ్ త్వరగా కోలుకోవాలని అభిలషించాడు.
కానీ అతను కోలుకోలేదు. అతడి ఆరోగ్యం మరింత క్షీణించి ఆదివారం తుది శ్వాస విడిచాడు. బన్నీ వెళ్లొచ్చిన వారానికే గణేష్ చనిపోవడంతో అభిమానులందరినీ కలచి వేసింది. సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక అభిమానులెవరికైనా పెద్ద కష్టం వచ్చినట్లు తమ దృష్టికి వస్తే హీరోలు స్పందిస్తున్నారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్..పవన్ కళ్యాణ్...లాంటి వాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్న తమ అభిమానుల్ని కలుసుకుని వారికి ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు