కథలు ఓకె.. గ్రీన్ సిగ్నల్ కి టైముంది!!
గీత ఆర్ట్స్ అంటే.. సినిమా కథలకి బ్యాంకు లాంటిది. గీత ఆర్ట్స్ కి నమ్మకమైన వ్యక్తి నిర్మాత బన్నీ వాసు.. గీత ఆర్ట్స్ వద్దకు వచ్చే దర్శకుల [more]
గీత ఆర్ట్స్ అంటే.. సినిమా కథలకి బ్యాంకు లాంటిది. గీత ఆర్ట్స్ కి నమ్మకమైన వ్యక్తి నిర్మాత బన్నీ వాసు.. గీత ఆర్ట్స్ వద్దకు వచ్చే దర్శకుల [more]
గీత ఆర్ట్స్ అంటే.. సినిమా కథలకి బ్యాంకు లాంటిది. గీత ఆర్ట్స్ కి నమ్మకమైన వ్యక్తి నిర్మాత బన్నీ వాసు.. గీత ఆర్ట్స్ వద్దకు వచ్చే దర్శకుల దగ్గర కథలు విని అందులో బావున్న వాటిని ఫైనల్ చేస్తుంటారు. మరీ సూపర్ గా ఉంటే బన్నీ కి లేదంటే అల్లు శిరీష్ కి షిఫ్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా గీత ఆర్ట్స్ వాళ్లతో ఈ కథలు వినే ప్రోగ్రాం పెట్టుకున్నాడట. అయితే బన్నీ సుకుమార్ తో చెయ్యబోయే పుష్ప తర్వాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ సినిమా చెయ్యాల్సి ఉంది. దానిపై క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు బన్నీ కి కథలు వినిపించడానికి కొంతమంది దర్శకులు రెడీ అయ్యారు. అందులో ఇప్పుడు ఓ దర్శకుడి కథని బన్నీ విని మెచ్చుకున్నట్లుగా వార్తలోస్తున్నాయి.
ఆనందో బ్రహ్మ, రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర చేసిన దర్శకుడు మహి. వి. రాఘవ్ చెప్పిన స్టోరీ లైన్ కి అల్లు అర్జున్ ఇంప్రెస్స్ అయ్యాడట. పూర్తి స్క్రిప్ట్ తో రా సినిమాని ఫైనల్ చేద్దామని మహి రాఘవన్ కి బన్నీ మాటిచ్చాడట. కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ కానీ.. లేదంటే లేదు అని చెప్పాడట. ఇక స్టోరీ లైన్ నచ్చిన అల్లు అర్జున్ మహి తెచ్చే స్క్రిప్ట్ మీద తన నెక్స్ట్ మూవీ ఆధారపడి ఉంది అని.. ఐకాన్ పక్కనబెట్టి అల్లు అర్జున్ మరో కొత్త కథ కోసం అన్వేషణ మొదలు పెట్టాడని.. ఈ లాక్ డౌన్ ని బన్నీ అందుకే ఉపయోగిస్తున్నాడని అంటున్నారు.