టాలీవుడ్ లో గీతా ఆర్ట్స్ అనేది పెద్ద సంస్థ అని అందరికి తెలిసిందే. మనకి తెలియటమే కాదు పక్క ఇండస్ట్రీ వాళ్లకి కూడా గీతా ఆర్ట్స్ గురించి తెలుసు. ఈ బ్యానర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్స్..సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సంస్థలో అల్లు అర్జున్ ఎన్నో చిత్రాల్లో చేసారు. అలాంటిది ఈ సంస్థ కాదని మరో ఆఫీస్ తీసుకుని కొత్త సంస్థ ను స్టార్ట్ చేయనున్నాడు బన్నీ.
సొంత నిర్మాణ సంస్థతో.....
బన్నీ కొత్త ఆఫీస్ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. గీత ఆర్ట్స్ మాదిరిగానే బన్నీ కూడా ఓ స్వంత నిర్మాణ సంస్థను తయారుచేసి, పెంచి పెద్ద చేయాలనే లాంగ్ విజన్ తో ఆలోచిస్తున్నాడు బన్నీ. అందుకుగాను రైటర్ వక్కంతం వంశీ, సాయి తదితరులను చేరదీసి కొత్త స్టోరీస్ వినడం..వాటిని డెవలప్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
చిన్న సినిమాలను సయితం.....
బన్నీ తన సొంత బ్యానర్ లో నటించడమే కాదు చిన్న చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నాడట. మరి అల్లు అరవింద్ కొన్నాళ్లు తర్వాత గీాత ఆర్ట్స్ ను బన్నీ కి అప్పచెప్తాడో లేదా శిరీష్ కి అప్పచెప్తాడో చూడాలి. గీతాఆర్ట్స్ అనే భారీ సంస్థ వున్నా, బన్నీ వేరు కుంపటి పెట్టడం కాస్త ఆశ్చర్యమే.