పోలీస్ ఆఫీసర్ గా అల్లు అర్జున్..?

Update: 2018-06-25 06:09 GMT

అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. నా పేరు సూర్య తో ఒక రేంజ్ లో మరో మెట్టు ఎక్కుదామనుకున్న అల్లు అర్జున్ కి ఆ సినిమా ఫలితం కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ఆ సినిమా దెబ్బకి అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలెట్టడానికి బోలెడంత టైం తీసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్ తో సినిమాని సెట్ చేసుకునే పనిలో ఉన్న అల్లు అర్జున్ ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తాడని ప్రచారం ఉంది. గతంలో సురేందర్ రెడ్డి - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన రేసు గుర్రం మంచి హిట్ అయ్యింది. కామెడీ కి కామెడీ, యాక్షన్ కి యాక్షన్, ఫ్యామిలీకి ఫ్యామిలీ సెంటిమెంట్ తో రేసు గుర్రం సూపర్ హిట్ అయ్యింది.

పోలీస్ గా మొదటి చిత్రం....

అయితే అల్లు అర్జున్ మరోసారి సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నటించేందుకు సిద్దమయ్యాడట. ఇప్పటికే వీరి మధ్యన కథా చర్చలు కూడా జరిగినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో క్లారిటీ రావడం లేదు. కారణం సురేందర్ రెడ్డి ప్రస్తుతం సై రా నరసింహారెడ్డి షూటింగ్ తో ఫుల్ బిజీగా వున్నాడు. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ కి కథ చెప్పే టైం సురేందర్ రెడ్డికి ఎక్కడుంటుంది. ఇకపోతే అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడని... అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి సారి పోలీస్ గా నటించే చిత్రమిదే అంటున్నారు.

ఫుల్ బిజీగా సురేందర్ రెడ్డి

మరి నిజంగానే సురేందర్ రెడ్డి - అల్లు అర్జున్ సినిమా సెట్ అయితే...వారి కాంబోలో రాబోయే రెండో సినిమాతో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాయో.. ఈ సినిమాపై ఎంతటి బుజ్ ఉంటుందో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మరి సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి పూర్తి చెయ్యాలంటే మరో ఏడాది టైం పడుతుంది. మరి ఈలోగా అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని కంప్లీట్ చేస్తాడేమో చూద్దాం.

 

Similar News