హీరోయిన్ అమల పాల్ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అవడానికి నానా తంటాలు పడుతుంది. డైరెక్టర్ విజయ్ తో పెళ్లి, విడాకుల తర్వాత అమల పాల్ కెరీర్ మీద దృష్టి పెట్టడమే కాదు.... ఫిట్నెస్ పరంగాను అమల చాలా కష్టపడుతుంది. అయితే పెద్ద స్టార్ హీరోల పక్కన అవకాశాలు రావడం లేదు కానీ... అమల పాల్ మాత్రం ఏదో ఒక సినిమాలో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే అమల పాల్ ఇటు ప్రేమ, పెళ్లి, విడాకులు, సినిమాల విషయాలతో కాకుండా ఒక కారు రిజిస్టేషన్ విషయంలోనూ బాగా హైలెట్ అయ్యింది. పుదుచ్చేరిలో కోటి విలువ చేసే బెంజ్ ఎస్ క్లాస్ కారుని కొని... అక్కడ పుడిచ్చేరిలోనే రిజిస్టేషన్ చేయించింది.
పన్ను కట్టకుండా ఎగ్గొట్టేందుకు పుదిచ్చేరి రిజిస్టేషన్ కారుని కేరళలో తిప్పుతూ అమల పాల్ కేరళ ప్రభుత్వానికి 20 లక్షల పన్ను ఎగ్గొట్టడంతో.. ఆమె పై కేసు నమోదైంది. అయితే అమల పాల్ ఈ విషయంలో న్యాయస్థానంలో లొంగిపోవడం.. ఆ వెంటనే బెయిలుపై బయటికి రావడంకూడా జరిగింది. అయితే తాజాగా అమల పాల్ పై నకిలీ రిజిస్టేషన్ కేసులో ఛార్జ్‌షీట్ నమోదు చేయాలని పోలీసులను కేరళ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మరి పుదిచ్చేరి లో కోరుకొని అక్కడ రిజిస్టేషన్ చేయించి... కేరళలో కారుని నడుపుతూ.. కేరళ ప్రభుత్వానికి 20 లక్షల ట్యాక్స్ ఎగ్గొట్టడంతో అమల చాలా చిక్కుల్లో పడింది.
ఇలా ట్యాక్స్ ఎగ్గొట్టిన కొందరు మాత్రం ప్రభుత్వానికి తన ట్యాక్స్ చెల్లించగా.. అమల మరికొందరు మాత్రం ట్యాక్స్ కట్టకపోవడంతో..... వారిపై కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుందట. మరి హీరోయిన్ గా మంచి దశలో లో ఉన్న అమల పాల్ ఇలా ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులో జైలుకి వెళితే ఆమె కెరీర్ అతలాకుతలం అవుతుంది. మరి కేవలం 20 లక్షల కోసం ఇలా కోర్టు కేసులు అంటూ తిరగడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అమల పాల్ కి ఆమె సన్నిహితులు చెబుతున్నారట. మరి అమల ఈ కేసులో అడ్డంగా బుక్ అయినట్లే అంటున్నారు