అమెరికా వ్యభిచార ముఠాకి టాలీవుడ్ లింకులు

Update: 2018-06-14 13:10 GMT

క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో ఇప్పటికే టాలీవుడ్ ప్రతిష్ఠ దిగజారగా, తాజాగా అమెరికాలో జరిగిన సంఘటనతో మరింత దిగజార్చింది. అమెరికాలోని చికాగోలో వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న ఓ టాలీవుడ్ తో లింకులున్న జంటను అక్కడి పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. టాలీవుడ్ కి చెందిన కొందరు నటీమణులను షోలు, వేడుకల పేరు చెప్పి అమెరికా తీసుకెళ్లి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని చికాగో పోస్ట్ పత్రిక ఒక వార్త ప్రచురించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. టాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్ మోదుగుముడి అలియాస్ శ్రీరాజ్ చొన్నుపాటి(34), అతడి భార్య చంద్ర(31)లను ఏప్రిల్ లో వ్యభిచార ఆరోపణలతో చికాగో పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో 42 పేజీల నేరారోపణలు చేశారు. వీరు ఇక్కడి నుంచి కొందరు నటీమణులను తీసుకెళ్లి అక్కడ జరిగే షోలు, కార్యక్రమాల్లో విటులను ఆకర్షిస్తారు. ఒక్కో విటుడి నుంచి సుమారు 3000 డాలర్లను వసూలు చేస్తున్నారు. అయితే, ఇక్కడి నుంచి వెళ్లిన నటీమణులను ఓ పాడుబడ్డ అపార్ట్మెంట్ లో ఉంచడం, వారిని వేదించడంతో తమకు విముక్తి కలిపించాలని వారు మెయిల్ చేయడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారింట్లో సోదాలు జరపగా 70 కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ జైల్లో ఉన్నారు. వారి ఇద్దరు పిల్లలను పోలీసుల వర్జీనియాలోని పిల్లల సంక్షేమ అధికారులకు అప్పగించారు.

Similar News