ఈ ఏడాది బాలీవుడ్ లో పెద్ద చిత్రాల్లో పెద్దగా హిట్ అయిన సినిమాలేవీ కనబడలేదు. ఏదో సంజయ్ లీలా బన్సాలి పద్మవత్ చిత్రం అనేక వివాదాలతో అదిరిపోయే వసూళ్లతో ఇరగదీసింది. అలాగే భారీ బడ్జెట్ తో టాలీవుడ్ బాహుబలి తలదన్నే స్థాయిలో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలు. ఇక ఈ మధ్యన సంజయ్ దత్ బయో పిక్ సంజు కూడా సూపర్ హిట్ అయ్యి సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చింది. రణబీర్ కపూర్... సంజయ్ దత్ పాత్రలో చేసిన సంజు సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఇక అలియా భట్ రాజీ సినిమా కూడా హిట్. ఇలా బాలీవుడ్ లో ఈ ఏడాది చెప్పుకోదగిన హిట్స్ లో ఈ సినిమాలున్నాయి.
ఇక బాహుబలిని టార్గెట్ పెట్టి తీసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. తాజాగా అమీర్ ఖాన్ కూడా భారీ బడ్జెట్ తో థగ్స్ అఫ్ హిందుస్థాన్ తీస్తే.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి భారీ నష్టాలూ వచ్చేలా కనబడుతున్నాయి. థగ్స్ అఫ్ హిందుస్థాన్ భారీ అంచనాల నడుమ భారీగా విడుదలైతే... మొదటి రోజు రికార్డు స్థాయిలో 50కోట్లు కొల్లగొట్టి బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి హిందీలో కొత్త రికార్డు సృష్టించింది. అయితే సినిమా మీదున్న అంచనాలతో బెస్ట్ ఓపెనింగ్స్ అయితే బుకింగ్స్ తో వచ్చింది కానీ... ఫస్ట్ షోకే సినిమాకి డివైడ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ సాయంత్రానికల్లా డ్రాప్ అవడంతో... సినిమాకి భారీ నష్టాల దిశగా పరుగులు పెట్టింది.
మరి రమారమిగా 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం 143కోట్ల వసూళ్లను రాబట్టడంతో చిత్ర నిర్మాతలకు అలాగే డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి థగ్స్ అఫ్ హిందుస్థాన్ తో నిర్మాతలకు నెత్తి మీద గుడ్డే అంటున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి.. భారీ అంచనాలతో విడుదల చేస్తే, నష్టాలూ కూడా భారీగానే వచ్చాయి. ...పాపం థగ్స్ అఫ్ హిందుస్థాన్ నిర్మాతలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.