#మీటూ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా మారింది. వివిధ రంగాల్లోని మహిళలు.. వృత్తిలో భాగంగా వారు ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి #మీటూ పేరుతో గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. మొదట బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై నటి తనుశ్రీ దత్త చేసిన ఆరోపణలతో మొదలైన #మీటూ క్రమంగా అన్ని రంగాల్లోకి విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా #మీటూపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. మహిళలకు ఇటువంటి వేదింపులు ఎదురైతే నిందితుడిని వెంటనే శిక్షించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలపై వేదింపులు చూస్తే మనస్సు కలిచివేస్తందని, వారికి రక్షణ ఇవ్వకపోతే దేశంపై చెరపేసుకోలేని మచ్చపడుతుందని ఆయన పేర్కొన్నారు.
This has to be the biggest lie ever. Sir the film Pink has released and gone and your image of being an activist will soon too. Your truth will come out very soon. Hope you are biting your hands cuz nails will not be enough. @SrBachchan #Metoo #MeTooIndia #comeoutwomen https://t.co/gMQXoRtPW3
— Sapna Moti Bhavnani (@sapnabhavnani) October 11, 2018
గోర్లు సరిపోవు... చేతులు కొరుక్కుంటారు
అయితే, అమితాబ్ వ్యాఖ్యాలపై ప్రముఖ బాలీవుడ్ హెయిర్ స్టయిలిస్ట్ సప్నా భవ్నానీ స్పందించి ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమితాబ్ వ్యాఖ్యలు అబద్ధమని, త్వరలోనే ఆయనకు ఉన్న సామాజికవేత్త అన్న పేరు కూడా పోతుందని ఆమె వ్యాఖ్యానించారు. అమితాబ్ నిజాలు త్వరలో బయటకువస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు... ‘‘నా ట్వాట్ చేసి కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారని, ఎందుకంటే కొరుక్కోవడానికి మీకు ఉన్న గోర్లు సరిపోవు కదా’’ అని ఆమె అమితాబ్ బచ్చన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు అమితాబ్ కు సంబంధించి ఏ నిజాలు బయటకువస్తాయని, సప్నా ఏం చెబుతారని చర్చ జరుగుతోంది.