పెళ్లికిముందే ప్రెగ్నెంట్

హీరోయిన్స్ మాత్రమే కాదు.. పెళ్ళికి ముందు ఎవరు తల్లికాబోతున్నా జనాలు షాకవడం అనేది పరిపాటే. కాకపోతే సెలబ్రిటీస్ అయితే మాత్రం అందరూ వింతగా చెప్పుకుంటారు. గత ఏడాది [more]

Update: 2019-03-31 11:56 GMT

హీరోయిన్స్ మాత్రమే కాదు.. పెళ్ళికి ముందు ఎవరు తల్లికాబోతున్నా జనాలు షాకవడం అనేది పరిపాటే. కాకపోతే సెలబ్రిటీస్ అయితే మాత్రం అందరూ వింతగా చెప్పుకుంటారు. గత ఏడాది బాలీవుడ్ లో పెళ్ళికాకుండా తాళ్ళవుతున్నాన్న కారణంతో హడావిడిగా ఓ జంట పెళ్లిపీటలెక్కింది. ఆ జంట ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నేహా దుపియా. నేహా పెళ్లికాకుండానే తల్లవడంతోనే వెంటనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయ్యింది. తాజాగా మరో హాట్ హీరోయిన్ పెళ్లిపీటలెక్కకుండానే తాళ్ళవుతుంది. ఆ విషయం సీక్రెట్ గా బయటికి రాలేదు. ఆ హాట్ హీరోయిన్ స్వయానా తానూ ప్రెగ్నెంట్ నంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆమె ఎవరో కాదు ఐ, రోబో 2.ఓ సినిమాల్లో నటించిన అమీ జాక్సన్. నటించింది తక్కువ సినిమాలే అయినా… హాట్ హాట్ యాంగిల్స్ లో సోషల్ మీడియాని ఓ ఊపు ఊపి క్రేజీ హీరోయిన్ గా మారింది. అయితే 2.ఓ విడుదలకముందు నుండి ఈ లండన్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూ… పెళ్లి చేసుకోబోతుందనే న్యూస్ వినబడింది. ఆ విషయాన్నీ అమీ ధ్రువీకరించింది. తన లవర్ కం బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడబోతున్న విషయం,. అయితే ఎపుడూ సోషల్ మీడియాలో అమీ జాక్సన్ హాట్ పిక్స్ కి చొంగలు కార్చే ఆమె అభిమానులకు అమీ పెద్ద షాకిచ్చింది. అదేమిటంటే తాను ప్రెగ్నెంట్ అని… ఓ పిక్ పోస్ట్ చెయ్యడంతో.. ఆమె అభిమానులు అవాక్కయ్యారు. అమీ తానెంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణమిది.. ఈ విషయాన్ని అందరితో గట్టిగా అరిచి చెప్పాలని ఉందని…. ఇదే సరైన టైం అని అందుకే తాను ప్రెగ్నెనేట్ అని అందరికి చెబుతున్నానని. త్వరలోనే తానూ పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నానంటూ పోస్ట్ చేసింది. మరి పెళ్లి విషయం క్లారిటీ ఇవ్వని ఈ భామ ఇప్పుడు ప్రెగ్నెంట్ విషయాన్నీ ఇలా ఓపెన్ గా రివీల్ చేసినందుకు అమీ జాక్సన్ అభిమానులైతే ఇంకా షాకులోనే ఉన్నారు.

Tags:    

Similar News